శ్రీకాకుళం జిల్లా పాలకొండ నగర పంచాయతీ రెండో పాలకవర్గం కొలువుదీరింది. ప్రిసైడింగ్ అధికారి ఆర్డీవో టీవీఎస్ కుమార్ ఆధ్వర్యంలో.. ఎన్నికైన 20 మంది కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం సభ్యులంతా ఏకగ్రీవంగా నగర పంచాయతీ అధ్యక్షురాలిగా రాధా కుమారిని ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షుడిగా రౌతు హనుమంతరావును ఎంపిక చేశారు. ఇప్పటి వరకు ప్రత్యేక అధికారి నిర్వహిస్తున్న బాధ్యతలను.. నగర పంచాయతీ అధ్యక్షురాలు రాధాకుమారికి అప్పగించారు. ఈ కార్యక్రమంలో ఎక్స్ అఫీషియో సభ్యులుగా విశ్వాస కళావతి పాల్గొన్నారు.
ఇవీ చూడండి...