రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 2 పట్ల వీఆర్వోల సంఘం హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో వీఆర్వోల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అప్పలనాయుడు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. వీఆర్వోలకు డీడీవో హోదా కల్పించడం సముచితమని అప్పలనాయుడు అన్నారు.
సచివాలయ ఉద్యోగులను రెవిన్యూ పరిధిలోకి తీసుకొస్తూ.. ప్రభుత్వం జీవో నంబర్ 2ను జారీ చేసింది. ఎప్రిల్ 1 నుంచి వీఆర్వోలకు డీడీవో హోదా రానుంది.
ఇదీ చదవండి: ఏప్రిల్ 1న కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోనున్న సీఎం జగన్