శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ఆక్సిజన్ సరఫరా కోసం చేసిన విజ్ఞప్తికి తూర్పు నావికాదళం స్పందించింది. తూర్పు నావికాదళం చీఫ్ వైస్ అడ్మిరల్ రాజేంద్ర బహదూర్ సింగ్ రూపకల్పన చేసిన ఆక్సిజన్ ఆన్ వీల్స్‌ను పలాసలో మంత్రి అప్పల రాజు మంగళవారం ప్రారంభించారు. విశాఖపట్నం నావల్ డాక్ యార్డ్ నిపుణుల బృందం దీని నిర్వహణ బాధ్యతలు తీసుకుంది. ఆసుపత్రి సిబ్బందికి దీని వినియోగం, నిర్వహణపై శిక్షణ ఇచ్చారు.
సొంతంగా రూపకల్పన చేసిన ఆక్సిజన్ ఆన్ వీల్స్ ప్లాంటును పలాసలోని కొవిడ్ కేర్ సెంటర్ వద్ద ఏర్పాటు చేశారు. అక్కడ ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్న వారికి నిరాటంకంగా ఆక్సిజన్ సరఫరా చేయడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని సీదిరి అప్పలరాజు అభిప్రాయపడ్డారు.
ఇవీ చదవండి: