నరసన్నపేట మండలం మడపాం టోల్‌గేట్ సమీపంలో లారీ పై నుంచి పడి డ్రైవర్ మృతి చెందాడు. మృతుడు ఒడిశాకు చెందిన డ్రైవర్‌గా గుర్తించారు. ఒడిశాలోని గంజాం జిల్లా చీకటి సమితి జగన్నాధపురం గ్రామానికి చెందిన ప్రతాప్ గౌడ(37) లారీ పై నిద్రిస్తూ జారి పడి మృతి చెందారు. బరంపురం నుంచి ఊక లోడుతో బయలుదేరిన లారీ ఈనెల 28న రాత్రి మడపాం టోల్‌గేట్‌కు చేరుకుంది. అక్కడ లారీని నిలిపివేసి లారీ పై నిద్రించగా, మత్తులో లారీ పై నుంచి జారి పడినట్లు సమీప బంధువు ఫిర్యాదు చేశారు. లారీపై నుంచి జారి పడిన ప్రతాప్ గౌడను శ్రీకాకుళం రిమ్స్ కు తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై సత్యనారాయణ తెలిపారు. అనుమానాస్పద మృతిగా కేసుగా నమోదు చేసినట్లు తెలిపారు.
ఇదీ చదవండి: 'నూతన్‌నాయుడుతో నాకు ప్రాణహాని ఉంది'