గిరిజన ఉత్పత్తులను... ఆన్‌లైన్‌లో విక్రయించేందుకు... శ్రీకాకుళం జిల్లా శ్రీకారం చుట్టింది. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ నివాస్ ఆన్‌లైన్ విక్రయాల యాప్‌ను ఆవిష్కరించారు. జిల్లాలో గిరిజన ప్రధాన ఉత్పత్తులైన కొండచీపుర్లు, పైనాపిల్ విక్రయాలను.. స్వయం సహాయక బృందాల అనుసంధానంతో ఈ యాప్ ద్వారా ప్రారంభిస్తున్నారు. కొనుక్కోవాలనుకునేవారు యాప్ ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చని ఐటీడీఏ పీవో తెలిపారు. సీతంపేట సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ, వెలుగు సంయుక్తంగా ఈ యాప్‌ను రూపొందించారన్నారు.
ఇదీ చదవండి: కృష్ణా జిల్లాలో 338కి చేరిన కరోనా కేసులు.. యంత్రాంగం అప్రమత్తం