ETV Bharat / state

9న ఎన్నికలకు.. సిద్ధంగా అధికారులు - ఎన్నికల వార్తలు

నేటితో తొలి విడత ఎన్నికలకు ప్రచారపర్వం ముగిసింది. శ్రీకాకుళం జిల్లాలో అభ్యర్థులు చివరిరోజు హోరాహోరీగా ప్రచారాన్ని నిర్వహించారు. లావేరు మండలంలో 9న జరగనున్న ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుని సంసిద్దంగా ఉన్నారు.

officials-made-
officials-made-
author img

By

Published : Feb 7, 2021, 10:12 PM IST

లావేరు మండలంలో 9న జరగనున్న తొలివిడత పంచాయితీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సామగ్రి సర్వం సిద్ధంగా ఉందని ఎన్నికల అధికారులు తెలిపారు. మండలంలో 24 పంచాయతీల పరిధిలో 57 మంది సర్పంచ్ అభ్యర్థులు, 176 వార్డు సభ్యులకు సంబంధించి 363 మంది పోటీ చేస్తున్నట్టు తెలిపారు. ఎన్నికల విధుల్లో 26 మంది రిటర్నింగ్ అధికారులు, 217 మంది పీవోలు, 302 మంది ఏపీవోలు, ఓపీవోలు పాల్గొంటారని మండల ఎన్నికల రిటర్నింగ్ అధికారి వి. శ్రీనివాసరావు తెలిపారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక గ్రామాల్లో ప్రత్యేక బృందాలతో నిఘా ఏర్పాటు చేశామని పోలీస్ అధికారులు పేర్కొన్నారు. ఎన్నికల విధుల్లో రెండు వందల మంది పోలీసులు పాల్గొంటారన్నారు. అతి సమస్యాత్మక గ్రామాల్లో వెబ్ కాస్టింగ్ ద్వారా ఎప్పటికప్పుడు వీడియోలు చిత్రీకరించి ఎన్నికల అధికారులకు పంపించడం జరుగుతుందని స్పష్టం చేశారు.

ముగిసిన ఎన్నికల ప్రచారం..

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం లావేరు మండలంలో 9న జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ప్రచారం సాయంత్రం ఐదు గంటలతో ముగిసింది. అభ్యర్థులు హోరాహోరీగా గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తమకు కేటాయించిన గుర్తులతో ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు.

ఇదీ చదవండి:

పోలింగ్ కేంద్రాల వద్ద తీసుకోవలసిన జాగ్రత్తలపై శిక్షణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.