ETV Bharat / state

పాలకొండలో పాటించని కొవిడ్​ నిబంధనలు..అధికారుల ఆగ్రహం

శ్రీకాకుళం జిల్లా పాలకొండలో డీఎస్పీ, ఆర్డీవో పర్యటించారు. పట్టణంలోని ప్రధాన మార్కెట్​తో పాటు పలుచోట్ల తనిఖీలు నిర్వహించారు. కొవిడ్​ నిబంధనల అమలు తీరుని పరిశీలించారు. ఆంక్షలు అతిక్రమిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

dsp
డీఎస్పీ పర్యటన
author img

By

Published : May 21, 2021, 6:07 PM IST

శ్రీకాకుళం జిల్లా పాలకొండలో డీఎస్పీ ఎన్.శ్రావణి, ఆర్డీవో కుమార్​ పర్యటించారు. పట్టణంలోని ప్రధాన మార్కెట్​తో పాటు పలుచోట్ల డీఎస్పీ తనిఖీలు చేపట్టారు. కొవిడ్​ నిబంధనలు గాలికొదిలేసి.. జనం గుంపులుగా ఉండటంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

పట్టణంలోని డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక కూరగాయల మార్కెట్​​కు ఆర్డీవో… సాధారణ వ్యక్తిలా వెళ్లి పరిశీలించారు. ఆ సమయంలో ప్రజలంతా సమూహాలుగా ఉండటం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కళాశాల మైదానంలో ఉద్యోగులు ఎవరూ లేకపోవడంతో తహసీల్దార్ సోమేశ్వరరావును ఫోన్​లో మందలించారు. కరోనా నిబంధనలు పక్కాగా అమలయ్యేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఇదీ చదవండి: కొవిడ్ బాధితుల సంరక్షణపై ప్రత్యేక దృష్టి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.