నాటుసారా స్థావరాలపై పోలీసుల తో కలిపి సెబ్ అధికారులు ఈ రోజు ఉదయం ముమ్మర తనిఖీలు నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండ పట్టణంలోని రెల్లివీధి, వీరఘట్టం మండలంలోని గ్రామాల్లో ఈ దాడులు నిర్వహించారు. నాటుసారా స్థావరాలు తెలుసుకునేందుకు పోలీసులు డ్రోన్ కెమెరాలు వినియోగించారు. ఎస్ వి బి ఎస్ పి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కొండ వీరఘట్టం సెబ్ అధికారులు దాడిలో పాల్గొన్నారు. వీరితో పాటు డీఎస్పీ శ్రీలత , పాలకొండలో పాల్గొని వీధిల్లో సారా అమ్మకాలపై అవగాహన కల్పించారు. నాటుసారా విక్రయించడం నేరమని అలా విక్రయిస్తే మహిళలు అని చూడకుండా కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండీ...కన్న తల్లి బరువైంది... జనసంచారం లేని ప్రాంతంలో వదిలేసిన కుమారుడు