శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం నౌపడా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్నికల సిబ్బంది ఆకలితో అలమటించారు. 800 మందికి పంచాయతీ ఎన్నికల శిక్షణా కార్యక్రమాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. అందుకు హాజరైన పీవోలు, ఆర్వోలకు మధ్యాహ్నం భోజనాలు సరిపడా అందించలేదు. ఆహారం సరిపోలేదంటూ దాదాపు 300 మంది నిరసనకు దిగారు. కనీసం సరిపడా మంచి నీరు ఇవ్వలేదని.. టీ, బిస్కెట్లు సైతం ఇవ్వకపోవడం దారుణమంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మధ్యాహ్నం 1.30 దాటినా భోజనాలు వండుతుండటంతో చాలామంది బయటి ప్రాంతాలకు వెళ్లి తినాల్సిన పరిస్థితి ఏర్పడింది.
పాతపట్నం మండలంలో ఎన్నికల విధులకు వచ్చిన ఉపాధ్యాయులకూ భోజనాలు లేకపోవడంతో నిరసనకు దిగారు. ఎంపీడీవో, ఎమ్మార్వో డౌన్ డౌన్ అంటూ బ్రిడ్జి పాఠశాల ఆవరణలో నినాదాలు చేశారు. మధ్యాహ్నం 2.30 గంటల వరకు భోజనాలు అందించకుండా.. కొంతమందికి ఆహారం ఉందని.. మరికొందరికి లేదని చెప్పారంటూ ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: