కరోనాను జయించటానికి జాగ్రత్తలు పాటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఊదరగొడుతున్నా.. మందుబాబులకు మాత్రం చెవికెక్కటం లేదు. శ్రీకాకుళం జిల్లాలో ప్రభుత్వ మద్యం దుకాణం ముందు మందుబాబులు భౌతిక దూరం పాటించకుండా, మాస్కులు ధరించకుండా క్యూలో నిలబడి మరీ మద్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. వారిని అదుపు చేసేందుకు ఇద్దరు కానిస్టేబుళ్లు ఉన్నా.. వారి సూచనలను సైతం మందుబాబులు పట్టించుకోవడం లేదు. కరోనా విజృంభిస్తోన్న వేళ మందుబాబుల నిర్లక్ష్యం అక్కడి ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది.
ఇదీ చదవండి: