గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పూర్తి స్థాయిలో సేవలందించలేక పోతున్నాయి. 24 గంటలు పనిచేయాల్సిన ఆవశ్యకత ఉన్నా...పలుచోట్ల ఆసుపత్రులు సమయానికి తెరవడం లేదు. అత్యవసర చికిత్సకు ప్రజలు పట్టణాల్లోని ప్రైవేటు దవఖానాలకు పరుగులుతీయాల్సి వస్తోంది. శ్రీకాకుళం జిల్లా పాలకొండలోని అన్నవరం ప్రభుత్వాసుపత్రి ఉదయం పదిన్నర గంటలకైనా తెర్చుకోలేదు. 25మంది సిబ్బంది ఉన్న..ఈ ఆస్పటల్లో ఒక్కరూ..అందుబాటులో లేరని రోగులు వాపోతున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు చొరవ తీసుకుని..తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఇవీ చదవండి...శవపరీక్షా కేంద్రం... సమస్యలకు నిలయం