శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం చిలకపాలెం పరిధిలోని నారాయణపురం భూసాగుదార్లకు పట్టాలివ్వాలని ఏపీ తెలుగు యాదవ మహాసభ అధ్యక్షుడు కోన గురవయ్య యాదవ్ డిమాండ్ చేశారు. సాగు హక్కు కల్పించాలని కోరుతూ స్థానిక తహసీల్దారు కార్యాలయం ఎదుట రైతులతో కలిసి రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. చిలకపాలేం గ్రామానికి అనుసరించి ఉన్న నారాయణపురం రెవెన్యూ పరిధిలో 170ఎకరాల భూమి ఉంది. స్థానిక దళితులు, బీసీలు సుమారు 200మంది తరతరాలుగా ఆ భూములను సాగుచేస్తూ జీవిస్తున్నారు.
రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం దౌర్జన్యం
ప్రస్తుతం వారందరిని అక్కడి నుంచి తరిమేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలుగు యాదవ మహాసభ నాయకులు ఆరోపించారు. పదేళ్ల కిందట వేసుకున్న జీడీ, నీలగిరి తోటలను దళారులు దౌర్జన్యంగా నరికివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పంట చేతికొచ్చే సమయంలో చెట్లు నరికివేస్తున్నారని రైతులు వాపోయారు. స్థిరాస్తి వ్యాపారులకు ఈ భూమిపై కన్నుపడిందని, అందుకే అక్రమంగా కాజేయాలని చూస్తున్నారని విమర్శించారు. ఎచ్చెర్లలో సాగుదారులు చేస్తున్న దీక్షకు ఏపీ తెలుగు యాదవ మహాసభ పూర్తిగా మద్దతు తెలుపుతోందని స్పష్టం చేశారు. సాగుహక్కులు కల్పించే వరకు పోరడతామని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: