శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస పురపాలక సంఘం పరిధిలోని వివిధ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్ రవి సుధాకర్ పర్యటించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి ఇళ్లకు వెళ్లి కరోనా జాగ్రత్తలు తెలిపారు. అనుమానం ఉన్న ప్రతి ఒక్కరికీ కరోనా టెస్టులు చేయించాలని వైద్య అధికారులను ఆదేశించారు. అనుమానితులంతా హోం క్వారంటైన్ లో ఉండాలని తెలిపారు. వైద్యాధికారులు, సిబ్బంది ప్రతి రోజు వారి ఇంటికి వెళ్లి పరిశీలించే విధంగా చూడాలని సూచించారు.
ఇదీ చూడండి: