వైకాపా సర్కారు ఏర్పాడిన దగ్గర నుంచి తెదేపాను అంతం చేయాలని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చుస్తోందని ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళం కలెక్టర్ నివాస్‌ను.. ఆయన నేతృత్వంలోని తెదేపా నేతల బృందం కలిసింది.
జిల్లాలో వైకాపా నేతలు అరాచకాలకు పాల్పడుతున్నట్టు ఫిర్యాదు చేసింది. రాష్ట్రంలో తెదేపా నేతలను ఒక్కొక్కరిగా దెబ్బ తీసేందుకు వైకాపా సర్కారు ప్రయత్నిస్తోందని నేతలు ఆరోపించారు. జిల్లాలో ఇసుక మాఫియాను వైకాపా ప్రోత్సహిస్తోందన్న రామ్మోహన్‌నాయుడు.. భవిష్యత్తులో రాజీలేని పోరాటాలు చేస్తామన్నారు.
ఇవీ చూడండి:
'23 రోజులుగా క్వారంటైన్లో ఉన్నాం.. ఇంకెప్పుడు విడిచి పెడతారు?'