పులివెందుల రాజకీయం అన్ని ప్రాంతాల్లో కనబడుతోందని ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు అభిప్రాయపడ్డారు. టెక్కలిలో చంద్రబాబు, అచ్చెన్నాయుడుపై వైకాపా నేత దువ్వాడ శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. శ్రీకాకుళం జిల్లా పోలీసు కార్యాలయంలో తెదేపా బృందం ఫిర్యాదు చేసింది. వైకాపా ప్రభుత్వం దౌర్జన్య పాలన చేస్తుందన్నారు. ఇలాంటి ఘటన తెదేపా చేసి ఉంటే వైకాపా నేతలు ఊరుకుంటారా అని ఎంపీ ప్రశ్నించారు. పోలీసులు చొరవ తీసుకొని శ్రీకాకుళం జిల్లాను ప్రశాంతంగా ఉండేలా చూడాలని కోరారు.
ఇదీ చదవండి :