తెదేపా నేతలపై మంత్రి సీదిరి అప్పలరాజు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తిత్లీ తుపాన్ పరిహారాన్ని ఆ పార్టీ నేతలు మింగేశారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద మాట్లాడిన మంత్రి... మత్స్యకార భరోసాపై తప్పుడు ప్రచారం చేయవద్దని హితవు పలికారు. రాజీనామా చేయాలంటూ కొందరూ సవాళ్లు విసిరుతున్నారని... అలాంటి వారు రాజీనామా చేసి బరిలోకి దిగాలన్నారు. ఎవరెంటో ప్రజాక్షేత్రంలో తేలుతుందన్నారు.
జీజీహెచ్పై సమీక్ష...
శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ఉత్తరాంధ్రలోనే ప్రముఖ ఆసుపత్రిగా పేరుగాంచాలని మంత్రి సీదిరి అప్పలరాజు ఆకాంక్షించారు. జీజీహెచ్ అభివృద్ధిపై మంత్రి సమీక్షించారు. మౌలిక సదుపాయలపై దృష్టి సారిస్తామన్నారు. పలు విభాగాల యూనిట్ల మంజూరుకు కృషి చేయాలని అధికారులకు సూచించారు.
ఇదీ చదవండి: