గుజరాత్ నుంచి శ్రీకాకుళం జిల్లాకు చేరుకున్న మత్స్యకార వలస కార్మికులను నరసన్నపేటలోని మూడు పునరావాస కేంద్రాలకు తరలించారు. ప్రతి ఒక్కరి నుంచి 3500 రూపాయల వంతున వసూలు చేశారని వలస కార్మికులు వాపోయారు. వీరిలో ఇద్దరికీ జ్వరం, ఆయాసం, జలుబు తదితర లక్షణాలు కనిపించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. స్థానిక పునరావాస కేంద్రంలో 149 మంది వలస కార్మికులు చేరగా... వారిలో ఇద్దరికి ఈ లక్షణాలు కనిపించాయి. వైద్య పరీక్షల కోసం వారిని శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు.
ఇదీ చూడండి బంగాళాఖాతంలో అల్పపీడనం.. వచ్చే మూడు రోజులు వర్ష సూచన