శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలంలోని నిమ్మాడ కూడలిలో ఉన్న గ్రానైట్ పాలిషింగ్ పరిశ్రమలో ఇతర రాష్ట్రాలకు చెందిన దాదాపు 403 మంది కార్మికులు పనిచేస్తున్నారు. లాక్డౌన్తో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నెలరోజులుగా చేసేందుకు పని లేక.. తినడానికి సరైన తిండి లేక అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధికారులు స్పందించి తమను సొంత రాష్ట్రాలకు తరలించాలని వేడుకుంటున్నారు. దీనిపై స్పందించిన స్థానిక అధికారులు వారికి పరీక్షలు నిర్వహించిన అనంతరం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్వరాష్ట్రాలకు తరలిస్తామని తెలిపారు.
ఇదీ చూడండి: