శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయం వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన పథకంలో పని చేస్తున్న కార్మికులు ధర్నా నిర్వహించారు. కరోనా కాలానికి వేతనాలు వెంటనే చెల్లించి.. సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
పెండింగ్‌లో ఉన్న చిక్కీల బిల్లులను తక్షణమే విడుదల చేయాలని కోరారు. మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేటు, స్వచ్ఛంద సంస్థలకు అప్పగించవద్దన్నారు. కనీస వేతనాలను అమలు చేసి.. ఉద్యోగ భద్రత కల్పించాలని కార్మికులు సూచించారు.
ఇదీ చదవండి: కొత్త రకం కరోనాపై ఆరోగ్య మంత్రి కీలక వ్యాఖ్యలు