శ్రీకాకుళం జిల్లా రాజాం పట్టణానికి చెందిన మైక్రో ఆర్టిస్ట్ జగదీష్.. మరోసారి తన ప్రతిభ కనబర్చాడు. స్వాతంత్య్ర దినోత్సవం సంబర్భంగా దేశభక్తిని చాటుకున్నాడు. 0.100 మిల్లీ గ్రాముల తీగతో భారతదేశ చిత్రపటాన్ని రూపొందించి జౌరా అనిపించాడు. మధ్యలో శాంతి చిహ్నమైన పావురాన్ని తయారు చేసి.. దానికి జాతీయ జెండా రంగులను అద్దాడు. దీనిని తయారు చేయడానికి సుమారు 45 నిమిషాలు పట్టిందని ఆయన తెలిపారు. ఈయన గతంలోనూ పలు చిత్ర పటాలను తయారు చేశారు.
ఇదీ చదవండి: CM JAGAN: విజయవాడలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్