శ్రీకాకుళం జిల్లా..
కవిటి మండలం ఇద్దివాని పాలెం, బొరివంక గ్రామంలో హృదయం పౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు హృదయం పౌండేషన్ అధ్యక్షుడు మిన్నారావ్ తెలిపారు. ఆ ప్రాంతాల్లో 60 మంది రక్తదానం చేసినట్లు తెలిపారు. ఆపదలో ఉన్న వారికి రక్తం ఇచ్చి ప్రాణ దాతలుగా నిలుస్తున్నారని మిన్నారావ్ చెప్పారు. ఆ ప్రాంతంలో తలసేమియా వ్యాధిగ్రస్థులకు అండగా ఉంటున్నామని అన్నారు.
విశాఖ జిల్లాలో..
ఆపద సమయంలో రక్తం దానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని అనకాపల్లి ఎన్టీఆర్ జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రవణ్ కుమార్ తెలిపారు. రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకొని అనకాపల్లి ఏరియా ఎలక్ట్రికల్ వర్కర్స్ సంఘ సభ్యులు రక్తదానం చేశారు. కరోనా సమయంలో రక్త నిల్వలు కొరవడుతున్న కారణంగా.. రక్త దానానికి ముందుకు వచ్చిన 12 మంది దాతలను ప్రశంసించారు.
అనంతపురం జిల్లాలో..
ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆ నలుగురు సేవాసమితి గుంతకల్ పట్టణంలో రక్త దాతలకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఆ సంస్థ గౌరవ అధ్యక్షులు కీర్తిశేషులు పెనికలపాటి ఆంజనేయలు జ్ఞాపకార్థం ఈ వేడుకను చేపట్టారు. గుంతకల్ డీఎస్పీ షర్ఫుద్దీన్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని రక్త దాతలను సన్మానించారు. రక్తం ఇచ్చి ఎన్నో ప్రాణాలు కాపాడిన రక్తదాతల అందరికీ వందనాలు తెలిపారు. ఇంతమంది రక్తదాతలు ఉండడం గుంతకల్లు పట్టణం చేసుకున్న అదృష్టమని డీఎస్పీ కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆ నలుగురు సేవా సమితి అధ్యక్షులు మంజుల వెంకటేష్, ఉపాధ్యక్షులు శ్రీధర్ రెడ్డి, రవీంద్ర, సమితి కార్యదర్శి సంపత్ కుమార్.. పాల్గొన్నారు.
ఇదీ చదవండి: