శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలంలోని కీర్తిపురంకు చెందిన యువకుడు బహుదా నదిలో స్నానానికి దిగి మృతి చెందాడు. గ్రామానికి చెందిన నాను బాలజగదీష్ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. స్నానం చేయడానికి నదిలో దిగిన జగదీష్‌కు ఈత రాకపోవడంతో నదిలో మునిగి మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది.
ఇదీచదవండి.