శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మున్సిపాలిటీ పరిధి పురుషోత్తపురం చెక్పోస్ట్ వద్ద లారీ డ్రైవర్లు ఆందోళన చేపట్టారు. ఆంధ్రా సరిహద్దు ప్రాంతంలోని జాతీయ రహదారిపై ధాన్యం లోడుతో వస్తున్న లారీలను అధికారులు నిలిపివేశారు. రాష్ట్రంలోకి వచ్చేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో ఆరు రోజులుగా అక్కడే వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహన చోదకులు ఆందోళనకు దిగారు. మరోపక్క ఈ విషయమై స్థానిక అధికార యంత్రాంగం ఉన్నతాధికారులకు నివేదిక పంపింది. అయినప్పటికీ ఫలితం లేకుండాపోయింది.
ఇవీ చూడండి...