ETV Bharat / state

నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు - ఆమదాలవలసలో లాక్ డౌన్ తాజా వార్తలు

కోవిడ్​-19 (కరోనా వైరస్​) వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన లాక్​డౌన్​ కార్యక్రమం శ్రీకాకుళం జిల్లాలో కొనసాగుతోంది. ఉదయం సమయంలో నిత్యవసర వస్తువులు కొనుగోలు చేసేందుకు తప్ప మిగిలిన సమయాల్లో ఎవరూ బయటకు రావొద్దని అధికారులు చెబుతున్నారు. నిబంధనలు అతిక్రమించి బయటకి వచ్చిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

శ్రీకాకుళం జిల్లాలో కొనసాగుతున్న లాక్​డౌన్​

author img

By

Published : Mar 25, 2020, 1:25 PM IST

శ్రీకాకుళం జిల్లాలో కొనసాగుతున్న లాక్​డౌన్​

కరోనా వ్యాప్తిని అరికట్టే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన లాక్​డౌన్​ కార్యక్రమం శ్రీకాకుళం జిల్లాలో కొనసాగుతోంది. పలు పట్టణాల్లో పోలీసులు, అధికారులు పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకి రావొద్దు

లాక్​డౌన్​ కారణంగా ఆమదాలవలసలో దుకాణాలన్నీ పోలీసులు మూసివేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు పట్టణంలో 144 సెక్షన్ విధించారు. ఎవరూ గుంపులుగా ఉండకూడదని సీఐ ప్రసాదరావు హెచ్చరించారు. ఉదయం 8:30 వరకు నిత్యవసర వస్తువుల కొనుగోలు నిమిత్తం ప్రజలకు వెసులుబాటు కల్పించారు. అనంతరం 9:30 గంటల తర్వాత దుకాణాలన్నీ మూసివేయాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దని ప్రచారం చేపట్టారు.

నిర్మానుష్యంగా మారిన శ్రీకాకుళం రోడ్​ రైల్వే స్టేషన్​

ఆమదాలవలసలో ఉన్న శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్ గత మూడు రోజులుగా నిర్మానుష్యంగా మారింది. జిల్లాలో అతి ప్రధానమైన రైల్వే స్టేషన్ కావటంతో రోజుకు సుమారు ఐదు లక్షల వరకు ఆదాయం వచ్చేది. అయితే కరోనా వైరస్ కారణంగా స్టేషన్ పూర్తిగా మూసివేశారు. ఈ రైల్వే కేంద్రం ద్వారా రోజుకు సుమారు 20 వేల మంది ప్రయాణికులు వివిధ ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించే వారని అధికారులు తెలిపారు.

సామాజిక దూరం పాటించండి

పాతపట్నంలో లాక్​డౌన్​ కొనసాగుతోంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఉదయం 6 నుంచి 9 వరకు నిత్యావసర దుకాణాలకు అవకాశం కల్పించారు. ప్రజలు సామాజిక దూరం పాటించి వస్తువులు కొనుగోలు చేయాలని సూచించారు. స్థానిక ఎస్ఐ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది రహదారులపై రవాణా నిలుపుదల చేశారు.

నిత్యవసర వస్తువులకు ప్రత్యేక ఏర్పాట్లు

కరోనా వైరస్ నేపథ్యంలో ప్రజలకు నిత్యవసర వస్తువుల సమస్య రాకుండా అధికార యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. పాలకొండలోని డిగ్రీ కళాశాల మైదానంలో ఉదయం 6 గంటల నుంచి 9 వరకు కూరగాయల మర్కెట్లకు అనుమతినిచ్చారు. ప్రజలకు నిత్యవసర వస్తువుల విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని ఆర్డోవో తెలిపారు.

ఇదీ చూడండి:

మాట వినకుండా బయటకు వస్తే కఠిన చర్యలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.