శ్రీకాకుళం జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రం శ్రీముఖలింగం ఆలయంలో కార్తీక మాస ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వేకువజాము నుంచే భక్తులు శ్రీముఖలింగేశ్వరున్ని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా అధికారులు చర్యలు చేపట్టారు.
ఆలయ ప్రాంగణంలో మహిళలు దీపారాధనలు చేశారు. పలువురు శైవభక్తులు వ్రతదీక్షలు చేపట్టారు. నరసన్నపేట మండలం లకిమెరలోని శివాలయం, పోలాకి మండలం దుబ్బాకవాని పేటలోని జగదీశ్వరాలయాలు భక్తులతో కిటకిటలాడాయి.
ఇదీ చదవండి: