శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం చవ్వాకుల పేట వద్ద ఉన్న వంశధార ఇసుక ర్యాంపును జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్ పరిశీలించారు. ఇసుక అమ్మకాలు, నిల్వలు తదితర అంశాలపై వివరాలు తెలుసుకున్నారు.
విక్రయాల్లో అక్రమాలకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ర్యాంపు నుంచి ట్రాక్టర్ ద్వారా డంపింగ్ చేస్తున్న కూలీలకు వారం నుంచీ వేతనాలు చెల్లించకపోవటంపై జేసీ మండిపడ్డారు. కూలీలకు తక్షణమే వేతనాలు చెల్లించాలని ఇసుక ర్యాంపు యాజమాన్యానికి సూచించారు.
ఇదీ చూడండి: