గాల్వన్ సమీపంలో విధులు నిర్వర్తిస్తున్న సమయంలో బాంబు పేలి అమరుడైన లాంచ్ నాయక్ లావేటి ఉమామహేశ్వరరావు(37) అంత్యక్రియలు బుధవారం స్వస్థలమైన శ్రీకాకుళం నగరంలో సైనిక లాంఛనాలతో నిర్వహించారు. హడ్కో కాలనీ ప్రజలు, స్నేహితులు వీర సైనికుడికి అశ్రునివాళి అర్పించారు.
తనతో పాటు బాధ్యతలు స్వీకరించిన సహచరులు ఈ ఏడాది ఉద్యోగ విరమణ చెందినా...యూనిఫాంపై మక్కువతో దేశానికి సేవ చేయాలనే ఆశతో బాంబ్ డిస్పోజల్ కోర్సు పూర్తి చేసి మరో రెండున్నరేళ్లు సర్వీసును పెంచుకున్నారు ఉమామహేశ్వరరావు. ఫిబ్రవరి 23న జమ్మూకశ్మీర్‌లో విధులు నిర్వహించేందుకు వెళ్లారు. కార్గిల్ సమీపంలో శత్రు దేశాలు దాచి పెట్టిన బాంబులు నిర్వీర్యం చేస్తూ శనివారం ఆయన అమరజీవుడయ్యాడు.
ఇదీ చదవండి