శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండల కేంద్రంలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఆక్రమణలను గురువారంలోపు తొలగించాలని అధికారులను సీతంపేట ఐటీడీఏ పీఓ సీహెచ్ శ్రీధర్ ఆదేశించారు. మండల కేంద్రంలో ఆక్రమణకు గురైన రోడ్డు ప్రాంతాలను బుధవారం ఆయన పరిశీలించారు. ప్రధాన రహదారి పొడవునా ఆక్రమణలు ఉండడం గుర్తించామన్నారు. తక్షణమే ఆక్రమణలు తొలగించకపోతే జరిమానా విధిస్తామని హెచ్చరించారు.
రహదారుల పైన తోపుడు బండ్లు ఉండకూడదని సూచించారు. ఆక్రమణల కారణంగా అంతర్రాష్ట్ర రహదారిగా ఉన్న ప్రధాన రహదారి ఇరుకుగా మారిందని అన్నారు. పలుమార్లు రోడ్డు మార్గాలు ఆక్రమణలకు గురయయ్యాయని ఫిర్యాదులో రావడంతో ఎట్టకేలకు స్పందించిన పీఓ ఆక్రమణల తొలగింపునకు శ్రీకారం చుట్టారు.
ఇదీ చదవండి:
AP-TG WATER ISSUE: కృష్ణా జలాలపై... మరోసారి సుప్రీంకు రాష్ట్ర ప్రభుత్వం!