విజయనగరం జిల్లాలోని తోటపల్లి రిజర్వాయర్ ద్వారా ఎడమ ప్రధాన కాలువ శివారులో ఉన్న పాలకొండ మండలానికి మంగళవారానికి నీరు చేరింది. గత నెల 26న రిజర్వాయర్ నుంచి ఎడమ కాలువ ద్వారా సాగునీటిని అధికారులు విడుదల చేశారు. 16 రోజుల తర్వాత ఎట్టకేలకు సాగునీరు శివారు ప్రాంతానికి చేరడంపై రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి ఏటా రిజర్వాయర్ కు చిట్ట చివర ఉన్నపాలకొండ మండలానికి సాగునీరు చేయడం గగనంగా ఉండేది. దీంతో రైతులు సాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడేవారు. మోటర్లు, వర్షాలపై ఆధారపడి సాగు చేసేవారు. ఈ ఏడాది ఆగస్టు 11 నాటికి నీరు చేరడంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పంట పండే వరకూ ఇదే తీరుగా సాగునీరు అందించాలని కోరుతున్నారు.
ఇవీ చదవండి: