ETV Bharat / state

దిగువ ప్రాంతాలకు వంశ'ధార'లేదు

సాగునీటి కష్టాలు అన్నదాతను నానాటికి వేధిస్తూనే ఉన్నాయి. జలాశయాలు పొంగే వరద వస్తున్నా... పొలాల్లో చుక్కనీరు రాని పరిస్థితి శ్రీకాకుళం జిల్లా రైతులది. వంశధార అందుబాటులో ఉన్నా సాగునీటికి నోచుకేలేకపోతున్నారు అక్కడి రైతులు.

శ్రీకాకుళం జిల్లా రైతుల నీటి కష్టాలు
author img

By

Published : Sep 18, 2019, 12:25 PM IST

వంశధార ప్రాజెక్టు ఎడమ కాలువ కింద లక్షా 48వేల ఎకరాలు, కుడికాలువ కింద 68వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రస్తుతం వంశధార నదిలో 19వేల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తుండగా ఎడమ కాల్వకు కేవలం 19వందల క్యూసెక్కులే సరఫరా అవుతోంది. అరకొర నీటితో సాగు భూములకు ఖరీఫ్ వ్యవసాయం ప్రశ్నార్థకంగా మారిందని రైతన్నలు వాపోతున్నారు.

నరసన్నపేట, టెక్కలి డివిజన్ పరిధిలోని మండలాలకు కాలువల ద్వారా విడుదల చేస్తున్న 1900క్యూసెక్కుల నీటిలో టెక్కలి డివిజన్​కు కేవలం 3 నుంచి 4 వందలే అధికారులు ఇవ్వగలుగుతున్నారు. నరసన్నపేట డివిజన్‌లో 98 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా టెక్కలి డివిజన్లో 50 వేలు ఆయకట్టు ఉంది. ఎగువ ప్రాంతంలో రైతులు కాలువలపై ఎక్కడికక్కడ అడ్డుకట్టవేసి నీటిని దిగువ ప్రాంతాలకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. వంశధార అధికారులు కాలువల నిర్వహణ పట్టించుకోవడంలేదని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. ఎగువ ప్రాంత రైతులు అడ్డుకట్టలు తొలగిస్తే దిగువ ప్రాంత గ్రామాల్లో నాట్లు వేయగలమని రైతులు చెబుతున్నారు.

అధికారుల నిర్లక్షానికి నిరసనగా దిగువ ప్రాంత రైతులు అడ్డుకట్టలు తొలగించే పరిస్థితులు తలెత్తుతున్నాయి. దీని వల్ల కొన్ని సార్లు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొంటున్నాయని ప్రజాప్రతినిధులు వాపోతున్నారుఈ పరిస్థితులు అర్థం చేసుకొని ఏటా చివరి భూములకు సాగునీరు అందే ఏర్పాట్లు చేయాలని రైతులు కోరుతున్నారు.

దిగువ ప్రాంతాలకు వంశ'ధార'లేదు

ఇదీ చూడండిజోరు వానలు...పొంగిన వాగులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.