ప్రతీ ఎకరాకు సాగు నీరు అందించేందుకు అధికారులంతా చిత్తశుద్ధితో పనిచేయాలని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణాదాస్ పిలుపునిచ్చారు. శ్రీకాకుళం కలెక్టరేట్లో కలెక్టర్ అధ్యక్షతన జరిగిన జిల్లా నీటిపారుదల సలహామండలి 26వ సమావేశంలో మంత్రులు ధర్మాన కృష్ణదాస్ , సీదిరి అప్పలరాజు, సభాపతి తమ్మినేని సీతారాం సహా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు పాల్గొన్నారు. ఖరీఫ్ సీజన్ సాగునీటి కోసం వంశధార, మడ్డువలస ప్రాజెక్టుల నుంచి జులై 8న నీటిని విడుదల చేయడానికి నిర్ణయించామని ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ తెలిపారు.
ఇవీ చదవండి