శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం మారేడుబాకలో కులబహిష్కరణ ఘటనపై సమగ్ర విచారణ చేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు పాలకొండ ఆర్డీవో కుమార్, డీఎస్పీ రారాజు ప్రసాద్, రాజాం పట్టణ సీఐ సోమశేఖర్లు విచారణ చేపట్టారు. గ్రామ పెద్దలతో చర్చించి వివరాలు సేకరించారు గ్రామంలో ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.
ఇదీచదవండి.