కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి కోసం చేపట్టిన లాక్డౌన్ శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో సరిగ్గా అమలు కావడంలేదు. జనం రోడ్లపైకి వచ్చి విచ్చలవిడిగా తిరుగుతున్నారు. నిత్యావసరాలు కొనేందుకు గుంపులు గుంపులుగా తిరుగుతున్నారు. నరసన్నపేట అంతటా అన్ని రకాల దుకాణాలు తెరచుకుంటున్నాయి. ఇరుకు రోడ్లు జనంతో కిటకిటలాడుతున్నాయి. వాహన రాకపోకలతో ట్రాఫిక్ స్తంభిస్తోంది.
ఇవీ చదవండి: దిల్లీ వెళ్లొచ్చిన వారి సంఖ్య వెయ్యికిపైనే!