శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసకు శ్రామిక్ రైలులో 295 వలస కార్మికులు చేరుకున్నట్టు స్థానిక తహసీల్దార్ పూజారి రాంబాబు తెలిపారు. కవిటి, సోంపేట, మందస మండలం ప్రాంతాలకు చెందిన వలస కార్మికులు వచ్చినట్లు చెప్పారు. లాక్డౌన్తో వేరే రాష్ట్రాల్లో జిల్లాకు చెందిన కూలీలు ఇబ్బంది పడుతున్నారని కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని వీరిని శ్రామిక్ రైళ్లలో శ్రీకాకుళం జిల్లాకు తరలించినట్లు పేర్కొన్నారు. 550 మంది వలస కార్మికులు రావాల్సి ఉండగా... 295 మంది మాత్రమే ప్రస్తుతం వచ్చారని అన్నారు. వీరందరిని 11 బస్సుల్లో కోటబొమ్మాలి మండలంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలించినట్లు తెలియజేశారు.
ఇదీ చదవండి: