ఒడిశా రాష్ట్రం బరంపురం నుంచి తూర్పుగోదావరి జిల్లా మండపేటకు అక్రమంగా తరలిస్తున్న రెండు లారీల ధాన్యాన్ని శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జాతీయ రహదారిపై నిలిపి ఉంచిన లారీలపై పోలీసులకు అనుమానం రావడంతో వారు రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. లారీ చోదకులను వివరాలు అడగ్గో.. వారి నుంచి సరైన సమాధానం రాలేదు. ఫలితంగా రూ.7 లక్షల విలువైన 380 క్వింటాళ్ల ధాన్యాన్ని అధికారులు సీజ్ చేశారు.
ఇదీ చదవండి.