శ్రీకాకుళం జిల్లా రేగిడి మండలం అంబకండి గ్రామంలో హైనా(Hyena halchal in Ambakandi) సంచారం.. స్థానికంగా హల్చల్ చేసింది. అంబకండి, సోమన్నపేట గ్రామాల మధ్య పంటపొలాల్లో చిరుతపులిని పోలి ఉన్న జంతువును స్థానికులు గుర్తించారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అటవీశాఖ సిబ్బంది.. పంట పొలాల్లో ఉన్న అడుగులను పరిశీలించి అది పులి కాదు.. పులి పోలికలు ఉన్న హైనాగా గుర్తించారు. జిల్లాలో పులుల సంచారం లేదని.. ఎవరూ భయపడాల్సిన పని లేదని అధికారులు సూచించారు.
ఇదీ చదవండి..
Viveka Murder Case: దస్తగిరి అప్రూవర్ పిటిషన్పై..కడప సబ్ కోర్టులో రేపు కౌంటర్ పిటిషన్