శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం పాలవలస పంచాయతీ మర్రిపాడు కొత్తవలస గ్రామాల మధ్య వొని గడ్డకు వంతెన గండి పడింది. సుమారు 100 ఎకరాల వరకు వరి నాట్లు ముంపుకి గురయ్యాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ వంతెన వద్ద రైతులకు అవసరమైనప్పుడు పొలాలకు నీరందించేందుకు పైపు ఏర్పాటు చేశారు.
గడ్డ ఉద్ధృతంగా ప్రవహించటంతో పైపు కొట్టుకు పోయి... పొలాల్లోకి నీరు చేరుతుందని రైతులు గగ్గోలు పెడుతున్నారు. వరి నాటు వేసి కొద్ది రోజులే కావటంతో వరి నాటు కొట్టు పోతుందని ఆందోళన చెందుతున్నారు. తక్షణమే అధికారులు స్పందించి ఈ ప్రాంతంలో శాశ్వత పనులు చేపట్టాలని కోరుతున్నారు.
ఇదీ చూడండి
బాధ్యత ఉండక్కర్లేదా....భారం పెంచుతావా?