రామతీర్థం పుణ్యక్షేత్రంలో రాముని విగ్రహంపై దాడి చేసిన దుండగులపై చర్యలు తీసుకోవాలని శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో పలు ధార్మిక సంస్థలు నిరసన చేపట్టాయి. నరసన్నపేట ఆంజనేయస్వామి ఆలయం నుంచి నిరసనకారులు ప్రదర్శన నిర్వహించారు. హిందుత్వంపై దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలని ధార్మిక సంస్థల నేతలు డిమాండ్ చేశారు. ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, సామాజిక సమరసతా ఫౌండేషన్, గీతా మందిరం తదితర సంస్థలకు చెందిన ప్రతినిధులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. వాలి, సుగ్రీవ, ఆంజనేయ తదితర వేషధారణ వ్యక్తులు ఆకట్టుకున్నారు.
ఇదీ చూడండి. కోసిగిలో 10 మందికి అస్వస్థత.. నీరే కారణమా..?