తనను ప్రైవేటు ఆస్పత్రికి తరలించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ మాజీ మంత్రి, తెదేపా శాసనసభ ఉపనేత, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ ముగిసింది. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేసిన పరీక్షల్లో కడుపులో అల్సర్ కణాలు ఉన్నాయని వైద్యులు గుర్తించినట్లు అచ్చెన్న తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. అచ్చెన్నాయుడి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు. వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించే విధంగా ఆదేశాలు జారీ చేయాలని కోరారు.
మరోవైపు అచ్చెన్న ఆరోగ్య పరిస్థితిపై నివేదికను రాష్ట్ర ప్రభుత్వం న్యాయస్థానంలో దాఖలు చేసింది. ఆయనను ఆసుపత్రికి తరలించే అవసరం లేదని ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. కేసును బుధవారానికి వాయిదా వేసింది.
ఇదీ చదవండి : కక్ష సాధింపుతోనే బీసీ నేతల అక్రమ అరెస్టులు: దేవినేని