ETV Bharat / state

రాష్ట్ర వ్యాప్తంగా.. సంక్రాంతి కోలాహలం - గుంటూరు జిల్లాలో సంక్రాంతి సంబరాలు

రాష్ట్రంలో ఎటుచూసినా పండుగ కోలాహలమే కనిపిస్తోంది. కళాశాలలు, కాలనీల్లో సంక్రాంతి వేడుకలు అంబరాన్నంటాయి. ముగ్గులపోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

grandly-sankranthi-celebration-overall-in-andhrapradhesh
రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా సంక్రాంతి సంబరాలు
author img

By

Published : Jan 13, 2021, 6:55 AM IST

రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా సంక్రాంతి సంబరాలు

రాజమహేంద్రవరంలో పంతం సత్యనారాయణ ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు అలరించాయి. భోగి మంటలు, హరిదాసు కీర్తనులు, గంగిరెద్దు విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ముగ్గుల పోటీల్లో మగువలు ఉత్సాహంగా పాల్గొన్నారు. స్థానిక ఎస్​కేవీటీ డిగ్రీ కళాశాలలో విద్యార్థులు ఆటపాటలతో అలరించారు.

గుంటూరు జిల్లా వడ్లమూడి విజ్ఞాన్ క్యాంపస్‌లో తెలుగుసంప్రదాయం ఉట్టిపడేలా వేడుకలు నిర్వహించారు. హరిదాసు కీర్తనలు, కోలాటాలతో ప్రాంగణంలో పల్లెవాతావరణాన్ని తెచ్చారు. విద్యాసంస్థల ఛైర్మన్‌ లావురత్తయ్య వేడుకల్లో పాల్గొని విద్యార్థుల్ని ఉత్సాహపరిచారు.

శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం మురపాకలో లక్ష ఒక్క పిడకల భోగి మహోత్సవం నిర్వహించగా కలెక్టర్ నివాస్‌, ఎమ్మెల్యే కిరణ్‌కుమార్‌ హాజరయ్యారు. ఆధ్యాత్మిక నగరి తిరుపతి శిల్పారామం, తాతయ్యగుంట గంగమ్మ ఆలయం వద్ద భోగి మంటలు వేశారు.

వివిధ పార్టీల ఆధ్వర్యంలోనూ సంక్రాంతి సంబరాలు జరిగాయి. గుంటూరు జిల్లా బలుసుపాడులో ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల‌్లో... మంత్రి తానేటి వనిత పాల్గొని ముగ్గుల పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో తెలుగుదేశం ఆధ్వర్యంలో..అమరావతికి వ్యతిరేకంగా ప్రభుత్వం విడుదల చేసిన జీవోలను భోగి మంటల్లో వేశరు. కృష్ణా జిల్లా మైలవరంలో జనసేన కార్యాలయం వద్ద సంక్రాంతి సంబరాలు జరుపుకొన్నారు.

ఇదీ చదవండి:

కృష్ణా జలాల వినియోగ వివరాలపై తెలుగు రాష్ట్రాల మధ్య కుదరని సయోధ్య

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.