శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం తంపటపల్లి గ్రామానికి చెందిన సరస్వతి, భాగ్యలక్ష్మి తల్లీకూతుళ్లు. వీరికి ఎవరూ లేకపోవడం వల్ల బతుకుదెరువు కోసం వీరఘట్టం మండలం కంబరవలస వెళ్లిపోయారు. స్థానిక ప్రభుత్వ పాఠశాలే వీరికి దిక్కయింది. ఈ క్రమంలో వృద్ధాప్యంతో తల్లి సరస్వతి మృతి చెందింది. మతిస్థిమితం సరిగా లేని కుమార్తె భాగ్యలక్ష్మి ఏమీ చేయలేని స్థితిలో ఉండిపోయింది. విషయం తెలుసుకున్న గ్రామ వీఆర్వో సురేష్, కానిస్టేబుల్ అశోక్, కొందరు గ్రామస్థులు వృద్ధురాలికి అంత్యక్రియలు నిర్వహించేందుకు ముందుకు వచ్చారు.
ఎవరూ లేని వృద్ధురాలికి అయినవారుగా మారి అంత్యక్రియలు నిర్వహించారు. మతిస్థిమితం లేని భాగ్యలక్ష్మి ఒంటరిగా మిగిలిందని.. ఆమెను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
ఇదీ చూడండి..