ETV Bharat / state

Vamsadhara: సిక్కోలు జీవధార ఓ గ్రామానికి కన్నీటి ధార.. కొద్దికొద్దిగా తన గర్భంలో కలిపేసుకుంటూ గుండెకోత - AP Latest News

Vamsadhara floods: వంశధార.. సిక్కోలు జిల్లా జీవధార. కానీ.. నదీ పరివాహకంలోని ఓ గ్రామానికి మాత్రం ఈ వంశధార.. కన్నీటి ధారే. ఉరకలెత్తిన ప్రతిసారి ఆ ఊరిని ఊచకోతకోస్తోంది. గ్రామాన్ని కొద్దికొద్దిగా తన గర్భంలో కలిపేసుకుంటూ.. గుండెకోత మిగులుస్తోంది.

Vamsadhara floods
Vamsadhara floods
author img

By

Published : May 7, 2023, 11:41 AM IST

సిక్కోలు జీవధార ఓ గ్రామానికి కన్నీటి ధార.. కొద్దికొద్దిగా తన గర్భంలో కలిపేసుకుంటూ గుండెకోత

Vamsadhara floods: శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం గెడ్డవానిపేట గ్రామానికి ప్రతి ఏటా వంశధార నది వరదల కారణంగా కోతకు గురై గ్రామం కుచించుకుపోతుంది. గ్రామానికి కరకట్టలు లేకపోవడంతో నదీ వేగానికి గ్రామం కోతకు గురై గూడు కోల్పోయి.. గత పదేళ్లలో 30 కుటుంబాలు గ్రామం వదిలి వలస బాటపట్టాయి.. ఇప్పటికైనా ప్రభుత్వం తమ గోడు పట్టించుకోవాలంటూ గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.

గెడ్డవానిపేట గ్రామ ప్రజలు వర్షాకాలం వచ్చిందంటే చాలు ప్రాణాలు అరిచేతులు పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తారు. ప్రతి ఏటా వస్తున్న వరదలతో నీటి ప్రవాహం కారణంగా గడ్డవానిపేట గ్రామం కొద్దికొద్దిగా నది గర్భంలో కలిసిపోతుంది. 10 సంవత్సరాల క్రితం గ్రామానికి 150 మీటర్ల దూరంలో ఉన్న నది ఇప్పుడు గ్రామానికి ఆనుకొని ఉంది. ఒకప్పుడు గెడ్డవానిపేట గ్రామంలో 150 కుటుంబాలు నివసించేవి, గ్రామంలోని మూడు వీధులు నదీ గర్భంలో కలిసిపోవడంతో 30కి పైగా కుటుంబాలు ఇళ్లు కోల్పోయి సొంత స్థలం లేక దిక్కుతోచక వేరే ప్రాంతాలకి తరలిపోయారు. ఒకప్పుడు అక్కడ మనుషులు నివాసం ఉండేవారనడానికి ఆడవాళ్లు కూడా కనిపించకుండా పోయాయి. ప్రతి ఏడాది నది ప్రవానికి 10 నుంచి 15 మీటర్లు గ్రామం పోతున్న అధికారులు ఎవరూ పట్టించుకోవట్లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు నిర్లక్ష్యాన్ని మానుకోకపోతే గ్రామం పూర్తిగా నది గర్భంలో కలిసిపోతుంది అంటున్నారు.

గెడ్డవానిపేట ప్రతి ఏడాది నదీ గర్భంలో కలిసిపోవడమే కాకుండా.. వరదల కారణంగా గ్రామంలో పంట నష్టం కూడా అధికమే.. వరద ముంపు నుంచి తప్పించుకోవడానికి గ్రామానికి రిటర్నింగ్ వాల్ కట్టడం కోసం గత టీడీపీ ప్రభుత్వం హయాంలో స్థానికుల నుండి భూసేకరణ చేసింది. గెడ్డవానిపేట గ్రామంతో పాటు చుట్టుపక్కల అదే పరిస్థితి కొనసాగుతున్న అనేక గ్రామాలకు 50 కిలోమీటర్లు మేర కరకట్టల నిర్మాణం చేసేందుకు.. 56 కోట్ల నిధులు మంజూరు చేసింది. కొంతమేర కాంక్రీట్ గోడలు మట్టి గోడలు పనులు జరుగుతున్న సమయంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.

ఆ తర్వాత ఈ పనులపై ఐదేళ్ల పాటు అపాలని ఉత్తర్వులు జారీ చేసింది. నరసన్నపేట నియోజకవర్గం ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ మంత్రి హోదాలో పని చేసిన తమను పట్టించుకోలేదని గ్రామ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదంగా మారిన గెడ్డవానిపేట గ్రామానికి కాంక్రీట్ గోడ నిర్మించేందుకు 12 కోట్ల రూపాయలు అవుతాయని అధికారులు నివేదిక ఇవ్వగా ప్రభుత్వం ఇప్పటికీ చర్యలు చేపట్టులేదు. ఇప్పుడైనా ప్రభుత్వం మేల్కొని గ్రామం నది గర్భంలో కలిసిపోకుండా కాంక్రీట్ గోడ నిర్మాణం పనులను చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

ఇవీ చదంవండి:

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.