శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గ పరిధిలోని ఎచ్చెర్ల, లావేరు, రణస్థలం, జి.సిగడం మండలాల్లో కుండపోత వర్షం కురిసింది. మరికొన్ని గ్రామాల్లో మోస్తరు వర్షం కురవడంతో నియోజకవర్గ రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఖరీప్ ప్రారంభమై ఇప్పటివరకు వర్షాలు కురవకపోవడంతో కొంతమేరకు ఆందోళన చెందిన రైతులు.. ఇవాళ వర్షం కురవటంతో రైతులు ఖరీఫ్ సాగుకు సన్నద్ధమవుతున్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఈ ఏడాది నాలుగు మండలాల్లో సుమారుగా 21 వేల హెక్టార్లలో వరి, మొక్కజొన్న, వేరుశనగ, కూరగాయ పంటలు, చెరకు, అరటి, బొప్పాయి తదితర పంటలను సాగు చేయనున్నారు.
ఇవీ చదవండి