శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస తన నివాసం వద్ద మాజీ ఎమ్మెల్యే, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు బొడ్డేపల్లి సత్యవతి గురువారం నిరసన కార్యక్రమం చేపట్టారు. లాక్ డౌన్ కారణంగా పనుల్లేక ఉపాధి కోల్పోయిన వారికి పూట గడవడమే కష్టంగా ఉందని, ఇలాటి సమయంలో కరెంట్ చార్జీలు పెంచడం చాలా దారుణం అని, వెంటనే తగ్గించాలని అని డిమాండ్ చేశారు. నిరుపేదల ఇళ్లకు అద్దెలు, బిల్లులను లాక్ డౌన్ కాలంలో ప్రభుత్వం భరించాలి అని అన్నారు. ఏఐసీసీ ఆద్యక్షురాలు సోనియగాంధీ అదేశాలు, పీసీసీ, అధ్యక్షుడు సాకే శైలజానాథ్, శ్రీకాకులం జిల్లా ఇంచార్జ్ జీఏ నారాయన పిలువు మేరకు నిరసన చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర బీసీ సెల్ కన్వీనర్ సనపల అన్నాజీరావు, కాంగ్రెస్ నాయకులు బోడ్డేపల్లి గోవిందగోపాల్,లఖినేని నారయణరావు, బస్వా షణ్ముఖరావు, లఖినేని సాయి, బొడ్డేపల్లి సాయి పాల్గొన్నారు.
ఇది చదవండి దుకాణాలు తెరిచేందుకు అదనపు మార్గదర్శకాలు