శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం నడుపూరు వద్ద సీఎస్పీ రహదారిపై.. చెరకు లారీ నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తమై వాహనాన్ని రహదారి పక్కన నిలిపివేశాడు. వెంటనే స్పందించిన గ్రామస్థులు.. సమీపంలోని బోర్ నుంచి నీటిని తెచ్చి మంటలను అదుపు చేశారు.
రహదారి పక్కనే పంట పొలాల్లో వరికుప్పలు ఉండటంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. స్థానికులు శ్రమించి మంటలు అదుపులోకి తీసుకురావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో లారీలోని చెరకు మొత్తం దగ్ధమైంది.
ఇదీ చదవండి: