శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గం పరిధిలోని చిట్టి పూడివలస మండల గ్రామంలో గురువారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో మూడు పూరిళ్లు దగ్ధం అయ్యాయి. స్థానికులు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించినప్పటికీ వీలు కాకపోవడం.. అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగింది. ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో వ్యక్తి గాయపడగా చికిత్స నిమిత్తం 108 వాహనం ద్వారా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందనేది ఇంకా తెలియాల్సి ఉంది.
ఇవీ చూడండి...