శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం చిన్నయ్య పేట గ్రామానికి చెందిన ఎడ్ల అప్పలనాయుడు(75) మృతి చెందాడు. ఇటీవల అనారోగ్యం కారణంగా... బంధువులు పాలకొండ సామాజిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ అప్పలనాయుడు మృతి చెందారు. ఆయనకు నలుగురు కుమారులు వారంతా ఉపాధి నిమిత్తం బయట ప్రాంతాలకు వెళ్లారు. లాక్డౌన్ కారణంగా అక్కడే చిక్కుకుపోయారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లో ఉన్న కుమారులు తండ్రి మృతదేహాన్ని చూసేందుకు కూడా వీలు లేకుండా పోయిందని కన్నీరుమున్నీరవుతున్నారు. బంధువులే అంతిమక్రియలు జరిపించారు.
ఇదీ చూడండి వారందరినీ బీమా పరిధిలో చేర్చండి: సీఎం జగన్