కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని దిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులకు, శ్రీకాకుళం జిల్లా పాలకొండ రైతులు మద్దతు తెలిపారు. నాటు బండ్లతో పట్టణంలోని పురం నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు ప్రదర్శన నిర్వహించారు.
రాష్ట్ర రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె.మోహన్ రావు మాట్లాడుతూ.. రైతులు డిమాండ్ చేస్తున్నా, కేంద్ర వెనకడుగు వేసేందుకు కార్పొరేట్ శక్తులే కారణమని ఆరోపించారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: