ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ.. శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం కత్తుల కవిటి గ్రామంలో రైతులు ఆందోళనకు దిగారు. ఖరీఫ్‌లో పండించిన పంటను... పొలాల్లోనే నిల్వ చేశామని.. నెలలు గడుస్తున్నా అధికారులు కొనుగోలు చేయటం లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ పరిధిలో 600 ఎకరాల్లో ఇప్పటికీ పొలాల్లోనే ధాన్యం బస్తాలు ఉన్నాయని వివరించారు. ప్రస్తుతం వాతావరణంలో మార్పులు రావటంతో.. రైతు భరోసా కేంద్రానికి వెళ్తే.. అక్కడ సిబ్బంది సరైన సమాధానం చెప్పటం లేదని ఆరోపించారు.
ఆర్డీవో టీవీఎస్‌జీ కుమార్‌కు.. ఈ సమస్యపై రైతులు ఫిర్యాదు చేశారు. తహసీల్దార్ అప్పారావు గ్రామానికి రాగా.. రైతులు ఆయన్ను నిలదీశారు. పంటను ఇంకెప్పుడు కొనుగోలు చేస్తారని ప్రశ్నించారు. పక్క గ్రామానికి వచ్చే లారీలు.. తమ గ్రామానికి ఎందుకు రావటం లేదని నిలదీశారు. కొనుగోలు కేంద్రాల ద్వారా త్వరలోనే ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని.. తహసీల్దార్ హామీ ఇచ్చిన తర్వాత... రైతులు శాంతించారు.
ఇదీ చదవండి: