శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గం కంచిలి మండలం ఎమ్మెస్పల్లి మోడల్ స్కూల్ సమీపంలో అక్రమంగా సారా ప్యాకెట్లను తరిలిస్తున్న పదిమంది వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ సతీష్ కుమార్, ఎస్సై దుర్గాప్రసాద్ తమ సిబ్బందితో తనిఖీలు నిర్వహించగా ఒడిశా గంగాపూర్ కు చెందిన పదిమంది వ్యక్తుల నుంచి సుమారు 40 వేల విలువచేసే 2400 ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
సీతంపేట మండలంలోని నాయుడు మల్లి గ్రామంలో ఎక్సైజ్ అధికారులు నాటుసారా కేంద్రాలపై దాడి చేసి 1600 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. నాటుసారా తయారు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.